ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
నందినీరెడ్డి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఓ బేబీ సినిమాతో వచ్చిన కలెక్షన్లు చూసి ఇండస్ట్రీయే షాక్ కి గురయింది. అలాగే వచ్చిన కలెక్షన్లు సినిమా గురించి మంచి జోష్ మీద ఉన్న సమంత సోషల్ మీడియాలో అభిమానులతో తన ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్టుల గురించి కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి అనేక విషయాలు పంచుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఓ వెబ్ సిరీస్ సినిమాలో నటిస్తున్నట్లు తన అభిమానులకు తెలిపింది.
ఇదీ అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అది ఓకే అయితే అప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సమంత హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. అలాగే మిగతా హీరోయిన్లు కూడా సమంతా ల వెబ్ సిరీస్ సినిమాలపై దృష్టి పెడితే బాగుంటుందని కూడా కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వారు కామెంట్ చేస్తున్నారు.