సినిమా రంగంలో హీరోయిన్ల రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. హీరోయిన్లకు హీరోల్లాగా లాంగ్ రన్ ఉండకపోవడంతో క్రేజ్ ఉన్నప్పుడే వాళ్లు నాలుగురాళ్లు వెనకేసుకోవాలనుకుంటారు. అందుకే ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు కూడా వాళ్ల రెమ్యునరేషన్ చుక్కల్లోనే ఉంటుంది. వయసు దాటి పోయి ఐదు పదుల వయస్సుకు చేరువ అయ్యే క్రమంలో కూడా సీనియర్ హీరోయిన్లు .... యంగ్ హీరోయిన్లకు ధీటుగా రెమ్యూనరేషన్ కావాలని పట్టుబట్టడం మాత్రం షాక్ ఇచ్చే వార్త అవుతుంది.
టాలీవుడ్ ను ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపిన సీనియర్ హీరోయిన్ టబు రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీకి షాక్ ఇస్తోంది. టబు ప్రస్తుతం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట. రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కే విరాటపర్వం సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో ఆమె వరుసపెట్టి సినిమాలతో బిజీ అయిపోయారు.
ఇంతకీ టబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా... ఒక్కో కమిట్మెంట్కు ఆమెకు రూ.60 లక్షలు ఇస్తున్నారట. జాతీయ ఉత్తమ నటిగా టబు పెర్ఫామెన్స్ గురించి ఆలోచించాల్సిన పనేలేదు. నిన్నే పెళ్లాడుతా- ఆవిడా మా ఆవిడే- చాందిని బార్(హిందీ)- సాతియా ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు టబు. ఇప్పటికే నాలుగున్నర పదుల వయస్సు దాటేసి మరో రెండు మూడేళ్లలో ఐదు పదులకు దగ్గర అవుతున్న ఈ అమ్మడికి ఈ వయస్సులోనూ ఇంత రేటు పలకడం గొప్ప విషయమే.