మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. దక్షిణాదితో పాటు ఉత్తరాధిని కూడా మెగాస్టార్ టార్గెట్ చేశాడు. ఇప్పటికే బిజినెస్ జరిగినపోయినట్టు సమాచారం. అమితాబ్ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్ లో మార్కెట్ అవుతుంది.
టాలీవుడ్ లో సైరాతో పోటీ పడేందుకు పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో కలెక్షన్ల సునామి ఖాయం అని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలీవుడ్ లో సైరాను అడ్డుకోవడానికి హృతిక్ రంగంలోకి దిగుతున్నాడు. హృతిక్, టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా చేసిన వార్ సినిమా కూడా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. సిద్దార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించారు. కొద్దిసేపటి క్రితమే 58 సెకన్ల నిడివి కలిగిన టీజర్ రిలీజ్ అయ్యింది. కొద్దిసేపట్లోనే టీజర్ 5 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.
హృతిక్, టైగర్ ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను భారీగా చిత్రీకరించారు. ఒళ్ళు గోగుర్లుపుట్టించే విధంగా యాక్షన్ ఉండటం విశేషం. ఇక వాణి కపూర్ తన అందచందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా బికినీలో మెరుపులు మెరిపించింది. యాక్షన్, అందంతో కలగలిపిన టీజర్ ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.