బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
గతంలో బాలయ్య పూరి కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా రావడం జరిగింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ...అదే క్రమంలో ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పూరి తో కచ్చితంగా మరొక సినిమా చేస్తానని బాలకృష్ణ మాట ఇవ్వడంతో...ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు పై స్పందించారు పూరి. ఇప్పటికే బాలకృష్ణ తో సినిమా చేశాను అది సరిగ్గా ఆడలేకపోయింది.
అయితే బాలకృష్ణ తో సినిమా అంటే కచ్చితంగా సరైన కథ రాసుకుని వెళ్లాలి..దానికి టైం పడుతుంది అంటూ..ప్రస్తుతం నా చేతిలో ఉన్న కథలు ఏమి కూడా బాలకృష్ణ కి సూట్ అయ్యే కథలు కాదని...బాలకృష్ణ తో సినిమా తీయాలంటే చాలా బలంగా ఆలోచించి స్టోరీ రాయాలని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. దీంతో స్టోరీ సెట్ అయ్యాక బాలయ్యతో సినిమా తీయడం గ్యారెంటీ అని పూరి పేర్కొన్నారు.