మహేష్ బాబు పుట్టిన రోజుకు నాగార్జున గిఫ్ట్ ఇస్తాడట..!!

Satya
టాలీవుడ్ హీరోల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉంటాయన్న సంగతి విధితమే. బయట పడరు కానీ అందరూ ఒక్కటిగా ఉంటారు. ఒకరి సినిమా హిట్ ని ఇంకొకరు ఆస్వాదిస్తారు. అలాగే ఒకరి ఆడియో ఫంక్షన్ కి మరొకరు వెళ్తారు. ఇక నాగార్జున వెరీ స్పషల్ మహేష్ బాబుకు. ఎందుకంటే మహేష్ తొలి మూవీ లాంచింగ్ కి అతిధిగా నాగ్ హారరయ్యారు.


అలాగే నాగ్ కొడుకు అఖిల్ మూవీ ఫంక్షన్ కి మహేష్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్యన మంచి రిలేషన్ ఉంది. ఇక నాగ్ లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 ని ఆగస్ట్ 9వ్ విడుదల చేస్తున్నారు. ఆ రోజు మహేష్ బర్త్ డే. అంటే సూపర్ స్టార్ జన్మ దినం వేళ నాగ్ మూవీ గిఫ్ట్ అన్న మాట.


నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందింది. రకుల్ ప్రీత్ - కీర్తి సురేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని నాగ్ మంచి ఆశ పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: