అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
ఇటువంటి నేపథ్యంలో తాజాగా బన్నీతో చేస్తున్న సినిమాలో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు యావత్ భారత దేశాన్ని ఒక ఊపు ఊపిన హాట్ హీరోయిన్ టబుతో సినిమాలో ఒక కీలక పాత్ర చేయిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. బయటకు వస్తున్న వార్తల ప్రకారం సినిమాలో నటించేందుకు హీరోయిన్ పూజా హెగ్డే కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
అంధాదున్, దే దే ప్యార్ దే చిత్రాలు ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో టబు క్రేజ్ బాగా పెరిగింది. దీనితో టబు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వక తప్పలేదు. హీరోయిన్ కంటే ఎక్కువగా డిమాండ్ చేసినా త్రివిక్రమ్...టబునే కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీనితో నిర్మాతలు ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేస్తున్నారు.