నగ్నంగా నటించేందుకు.. అమ్మ ఓకే చెప్పేసింది..?
అయితే.. అలా నగ్నంగా నటించేందుకు తన ఇంట్లో అనుమతి లభించిందని అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నగ్న సన్నివేశాల గురించి అమ్మకు చెప్పానంటోంది అమలాపాల్.. అలాంటి సీన్లు స్క్రిప్టుకు కచ్చితంగా అవసరం అనిపిస్తే నటించమని వాళ్లమ్మ ప్రోత్సహించారట. అందుకే తాను ధైర్యంగా ఆ సీన్లు చేశానంటోంది.
అంతే కాదు.. ఈ సినిమాలో ముద్దుసీట్లు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్లో అమలాపాల్ తన సహనటి ఆర్జే రమ్యను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ముద్దు సన్నివేశం గురించి ఆమె ఇలా స్పందించింది.
" ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేంటి? ఆ షాట్ అనుకోకుండా వచ్చింది, అది స్క్రిప్టులో లేదు. ఓసారి పాత్రలో లీనమైతే.. ఇక మన స్వభావాన్ని పక్కన పెట్టినట్లే. ఈ చిత్రం శృంగారం నేపథ్యంలో సాగేది కాదు. ఈ సినిమా కంటెంట్ అర్థం చేసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. నిజానికి ఈ చిత్రం నటిగా నాకు ఇంకాస్త నమ్మకం, బలాన్ని ఇచ్చిందంటోంది అమలాపాల్.