పూరి జగన్నాథ్- మహేష్ బాబు కాంబినేషన్లో `జనగణమన` చేస్తారని గత మూడేళ్లుగా వర్తాలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన పోకిరి, బిజెనెస్మన్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు మహేష్‌కు హిట్ అందించాయి. ఇటు ఫ్లాపుల్లో ఉన్న పూరీకి కూడా లైఫ్ ఇచ్చాయనే చెప్పాలి. అయితే మరో సారి వీరి కాంబినేషన్లో `జనగణమన` సినిమా చేయాలని అనుకున్నారు. ఈ చిత్రాన్నిమహేష్తో చేసేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారట. అయితే ప్రకటించిన తర్వాత ఈ సినిమాకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి.
అయితే వరస ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుపై సంచలన కామెంట్లు చేశారు. నేను ఫ్లాపుల్లో ఉన్న కారణంగా మహేష్ నాతో సినిమాకు ఒప్పుకోవడం లేదని.. నాకు ఎప్పైడేతే హిట్ వస్తుందో అప్పుడే ఆయన నాతో సినిమా చేస్తారని మహేష్ బాబుపై సెటైర్ వేస్తు వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో యాంటీ ఫ్యాన్స్ పూరీ జగన్నాథ్‌కు సపోర్ట్ చేస్తు మహేష్ బాబుపై కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారట. అదే సమయంలో రియాక్ట్ అయిన మహష్ ఫ్యాన్స్ పోకిరి, బిజినెస్‌మన్ సినిమాకు ముందు ఒక్క సక్సెస్ లేని పూరికి మహేష్ ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇచ్చారంటూ పూరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పూరి జగన్నాథ్ మహేష్ బాబుపై చేసిని కామెంట్లతో మహేష్ ఫ్యాన్స్ పూరిపై ఆగ్రహంతో ఉన్నారట.