ఎవరు ఊహించని పని చేసిన మాస్ మహారాజా రవితేజ..?
ఇక అసలు మేటర్లోకి వెళితే ఇటీవల వరుసగా ప్లాప్ లు వస్తున్న క్రమంలో రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా కూడా తగ్గలేదు మొన్నటివరకు. ఏదో ఒక సినిమా హిట్ అవుతుంది తన మార్కెట్ డిమాండ్ అలాగే ఉంటుంది అనుకుని రవితేజ చాలా ధీమాగా ఉన్నారు. కానీ సిట్యువేషన్ మరీ బ్యాడ్ అయ్యిపోయింది. నిర్మాతల నుంచి ఫోన్స్ రావటం దేవెడురుగు, తను ఫోన్ చేస్తున్నా ఎత్తే పరిస్దితి లేదు. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమా తర్వాత రవితేజకు అది స్పష్టంగా అర్దమైంది.
దాంతో ఈ సారి ఎలాగైనా ఓ సెన్సేషన్ హిట్ కొట్టాలనుకున్నాడు. తను హిట్ లో ఉంటే రెమ్యునేషన్ కు లోటేంది. అలా కమిటైందే "మహాసముద్రం" సినిమా. ఆర్ ఎక్స్ 100 డైరక్టర్ తో అయితే తనకు మరో సెన్సేషన్ హిట్ ఖాయమని ఓకే చేసాడు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు పారితోషికం తీసుకోవడం లేదు రవితేజ. దీంతో ఇండస్ట్రీ లో ఉన్నవారు అందరూ షాక్ అయిపోయారు. ఈ నేపథ్యంలో సినిమా అయితే లాభం లో షేర్ తీసుకుంటున్నట్లు లేకపోతే అది కూడా తీసుకోకుండా ఉండాలని రవితేజ ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.