ఇలియానా, కాజల్ అగర్వాల్ బాట పట్టిన కీర్తి సురేష్..?
విషయంలోకి వెళితే అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకుంది కీర్తి సురేష్. టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమా తో అద్భుతమైన ప్రశంసలను అందుకొంది తిరుగులేని నటిగా పేరు దక్కించుకుంది.
ఇటువంటి క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడం కోసం తన దగ్గరికి సౌత్ సినిమాలు వస్తున్నా కానీ రిజెక్ట్ చేస్తూ మరోపక్క బాలీవుడ్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ త్వరలో శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మించబోయే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రం కోసం ఒళ్ళు హూనం చేసుకుని బక్కచిక్కిపోయింది. ఇకపై బాలీవుడ్ చిత్రాల్లో నటించడం కోసం ముంబైలోనే ఉండాలని కీర్తి సురేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న అవకాశాలు వదిలేసి బాలీవుడ్ లో ఇబ్బందులు పడడం ఎందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.