విజయ్ దేవరకొండ vs ఎన్టిఆర్ - కొరటాల మధ్యలో ఇరుక్కునాడు గా !
ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ ని మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న వేశారు. అదేమిటంటే తర్వాత పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తారా లేక పోతే కొరటాలతో సినిమా చేస్తున్నారా..? అని ప్రశ్నలు వెయ్యగా. విజయ్ ఇచ్చిన సమాధానం పూరి జగన్నాథ్ తో సినిమా లేదని క్లారిటీ ఇవ్వగా.
మరోపక్క కొరటాలతో సినిమా ఉన్నట్లు విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య డైరెక్టర్ కొరటాల శివ టాపిక్ రచ్చ రచ్చ చేస్తోంది. కానీ ఏదిఏమైనా చిరంజీవి సినిమా తర్వాత కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలంటే కనీసం మరో ఏడాది గ్యారెంటీ అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.