హీరోయిన్స్ తో బాలయ్య బ్యాంకాక్ ట్రిప్ !
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఆగస్టు 7 నుండి బ్యాంకాక్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య - సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. ఇక ఈ హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక హీరోయిన్స్ గా నటించనున్నారు.
ఈ సినిమాకి 'రూలర్' అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుండి ఈ టైటిల్ ఫైనల్ చేసినట్లు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. విలక్షణ నటుడు జగపతిబాబు కూడా ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
`జైసింహా` వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రమిది.