ఆ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తలను చూసి సీరియస్ అయిపోయిన అల్లు అర్జున్..?
ఈ విధంగానే ఇటీవల త్రివిక్రమ్ తీస్తున్న సినిమా కో డైరెక్టర్ తో అల్లు అర్జున్ కి గొడవ అయినట్లు...బన్నీ సీరియస్ అయి ఒకానొక సమయంలో ఆ కో-డైరెక్టర్ పై పేపర్లు కూడా విసిరినట్లు కొన్ని వార్తలు బయటకు రావడం జరిగాయి. ఇదంతా ఓ ఇంగ్లీష్ పేపర్ లో రావడంతో ..ఆ పేపర్ పై బన్నీ సీరియస్ అయినట్లు...ఎవరైతే ఆ వార్తలు రాశారో వారిపై ఎంక్వయిరీ చేసి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
అంతేకాకుండా ఇంగ్లీష్ పేపర్ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా మరో బ్రహ్మోత్సవం అవుతుందని రాయటం తో బన్నీ 40 శాతం కూడా షూటింగ్ పూర్తి గాని సినిమా గురించి ఏంటా రాతలు అంటూ తీవ్రస్థాయిలో సదరు పత్రిక పై మండిపడినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. మరోపక్క ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని త్రివిక్రమ్...అల్లు అర్జున్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు...ఇటువంటి క్రమంలో దారుణమైన వార్తలు ఈ సినిమాపై రావటంతో అల్లు అర్జున్ సీరియస్ అవ్వటానికి కారణమట.