బాలయ్య కొత్త సినిమాకి పాత హీరోయిన్…!
అయితే అప్పట్లో నుండి ఇప్పటి వరకు అదే స్పీడ్ తో ఉన్న నందమూరి బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా నటించలేదు భూమిక. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో భూమిక ఛాన్స్ కొట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తున్న ఈ క్రమంలో మెయిన్ హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. సెకెండ్ హీరోయిన్ గా భూమికను సెలక్ట్ చేశారు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య, భూమిక లవర్స్ గా కనిపించబోతున్నారట.
గతంలో చిరంజీవి-భూమిక కాంబినేషన్ ను తెరపై చూసినప్పుడు చాలా విమర్శలు చెలరేగాయి. ఇద్దరి జోడీ అస్సలు బాగాలేదనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు బాలయ్య సరసన నటించనుంది భూమిక. వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరోపక్క బాలకృష్ణ పక్కన భూమిక హీరోయిన్ గా చేస్తున్నట్లు వార్త సోషల్ మీడియాలో రావడంతో కొత్త సినిమాకి ఈ పాత హీరోయిన్ ఎందుకు అంటూ నందమూరి అభిమానులు మండిపడుతున్నారట. శ్రీ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి త్వరగానే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలలో బిజీగా ఉన్న క్రమంలో...రాజకీయంగా మొత్తం ఫ్రీ అయ్యాక సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.