స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ఓ బేబీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం 38కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అలాగే భాగమతి ,మహానటి సినిమాల తరువాత 1 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టిన మూడవ చిత్రం గా ఓ బేబీ రికార్డు సృష్టించింది.
ఇక ఈ చిత్రం తమిళ ప్రేక్షకులముందుకు కూడా రానుంది. ఆగస్టు 15 న ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ అక్కడ విడుదలకానుంది. కాగా తమిళ్ లో సమంత కు మంచి ఫాలోయింగ్ వుంది. ఇటీవల ఆమె తమిళంలో నటించిన దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. దాంతో ఓ బేబీ ని తమిళ్ లోకి డబ్ చేసి అక్కడ విడుదలచేస్తున్నారు.
'అలా మొదలైంది' ఫేమ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సీనియర్ నటి లక్ష్మి , రావు రమేష్ , రాజేంద్ర ప్రసాద్ ,నాగ శౌర్య , తేజ ముఖ్య పాత్రల్లో నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక సమంత ఇటీవల మజిలీ తో సూపర్ హిట్ కొట్టగా తాజాగా ఈచిత్రంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ తో కలిసి 96 రీమేక్ లో నటిస్తుంది. అలాగే నాగార్జున నటించిన మన్మథుడు 2 లో కూడా అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఈనెల 9న విడుదలకానుంది.