బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతనే అవుతాడా...?

Reddy P Rajasekhar
జులై 21 వ తేదీన అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమైంది. 15 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షోలో మొదటివారం సినీ నటి హేమ ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక హేమ కావాలనే తనను బిగ్ బాస్ హౌస్ నుండి పంపించారని వ్యాఖ్యలు చేసింది. రెండో వారం ఈ షో నుండి జాఫర్ ఎలిమినేట్ కాగా జాఫర్ ఈ షో అంతా స్క్రిప్టెడ్ అనుకున్నానని కానీ ఈ షో స్క్రిప్టెడ్ కాదని వ్యాఖ్యలు చేసారు. 
 
ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. తమన్నా సింహాద్రి ప్రవర్తన ఇంటి సభ్యులకే కాక బిగ్ బాస్ వీక్షించే ప్రేక్షకులకు కూడా చికాకు తెప్పించే విధంగా ఉంది. బిగ్ బాస్ షోలో ప్రస్తుతం శ్రీముఖి, రోహిణి, రవికృష్ణ, అషు రెడ్డి, అలీ రేజా, బాబా భాస్కర్, శివ జ్యోతి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం మాత్రం ఎక్కువగా బాబా భాస్కర్ కే ఉన్నట్లు తెలుస్తుంది. 
 
మొదటి రెండు వారాలు బాబా భాస్కర్ ఎలిమినేషన్ కు నామినేట్ కాకపోయినా మూడో వారం నామినేట్ అయ్యారు. బాబా భాస్కర్  బిగ్ బాస్ షోకు ముందు అంత ఫేమస్ కానప్పటికీ బిగ్ బాస్ షోకు వచ్చాక మాత్రం బాగా ఫేమస్ అయ్యారు. అనధికారికంగా జరిపిన సర్వేల్లో ఈ వారం బాబా భాస్కర్ ఎలిమినేట్ కాకూడదని 60% ఓట్లు వచ్చాయి. ఈ షో నుండి రెండో వారం ఎలిమినేట్ అయిన జాఫర్ కూడా బిగ్ బాస్ షో విన్నర్ బాబా భాస్కర్ అయ్యే అవకాశం ఉందని ఇంటర్వ్యూలో చెప్పాడు. 
 
బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లో అనసరమైన వివాదాల జోలికి పోకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లోను బాబా భాస్కర్ పై ఎంతో అభిమానం ఉంది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ బాబా భాస్కర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: