అనిల్ రావిపూడి సినిమాలో మహేష్ సెంటిమెంట్ హిస్టరీ క్రియేట్ చేస్తుందా..?
ఇదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ కి తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు నాడు తాను చేస్తున్న సినిమా ట్రైలర్ కానీ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తే ఆ సినిమా కచ్చితంగా బంపర్ హిట్టవడం ఖాయమని బలంగా నమ్ముతారు. అంతేకాకుండా మహేష్ కి తన సినిమాలలో తన క్యారెక్టర్ పేరు అజయ్ అని ఉంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని రెండుసార్లు రుజువయింది. ఇప్పుడు తాజాగా అదే పేరుతో అజయ్ పేరుతో అనిల్ రావిపూడి సినిమాలో క్యారెక్టర్ చేస్తున్న నేపథ్యంలో మహేష్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేస్తుందా..? అని ఇండస్ట్రీలో ఉన్నారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వరుసగా రెండు బ్లాక్ మాస్టర్ లు కొట్టిన మహేష్ బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నా విషయం మనకందరికీ తెలిసినదే.
ఇటువంటి నేపథ్యంలో గతంలో ఒక్కడు సినిమాలో మరియు దూకుడు సినిమాలో అజయ్ పేరు పెట్టుకొని ఇండస్ట్రీ లో సంచలనాలు సృష్టించిన మహేష్...తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా అదే పేరుతో నటించడంతో అజయ్ పేరుతో హ్యాట్రిక్ హిట్ మహేష్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.