వివాదాస్పద టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 3 తెలుగు ప్రేక్షకులకు అంతగా కిక్ ఇవ్వడం లేదు. దానికి కారణం ఎలిమినేషన్ పక్రియ ఉత్కంఠభరితంగా లేకపోవడమే. వారం వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక ప్రేక్షకులను ఎంత సస్పెన్సు గురి చేస్తే షో అంత హిట్ అవుతుంది కానీ ఈవిషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు పెద్దగా ద్రుష్టి పెట్టినట్లు లేరు. ఆదివారం ఎలిమేషన్ పక్రియ వుండగా... శనివారమే ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటివరకు హౌస్ నుండి ముగ్గురు కంటెస్టెంట్లు బయటికివెళ్ళిపోయారు. వీరిలో మొదటి కంటెస్టెంట్ గా హేమ ఎలిమినేట్ అయ్యింది. అయితే హేమ ఎలిమినేషన్ ఫై పెద్దగా బయటకు లీకులు రాలేదు కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే విషయం మాత్రం ఒక రోజు ముందే తెలిసిపోయింది.
కాగా రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అవ్వనున్నాడని శనివారం నుండే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానికి తగట్లు గానే జాఫర్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇక మూడో వారం తమన్నా ఎలిమినేట్ కానుందన్న వార్త శనివారం ట్రేండింగ్ లో కొనసాగింది. కాగా తమన్నా కూడా ఎలిమినేట్ అయ్యింది. అయితే తమన్నా విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏంలేదు. ఆమె ఎలిమినేషన్ ఊహించిందే. మరి బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికైనా ఎలిమినేషన్ కు సంబంధించి ఎలాంటి లీకులు జరుగకుండా చూసుకుంటారో లేదో చూడాలి. కాగా నిన్న ఎలిమినేట్ అయిన తమన్నా సింహాద్రి కి బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ కు రానన్ని అతి కొద్దీ శాతం ఓట్లు వచ్చాయట. మొత్తానికి తమన్నాకు ఒక మంచి అవకాశం బిగ్ బాస్ షో కలిపిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వింత ప్రవర్తన తో ప్రేక్షకుల ఆగ్రహానికి గురై షో నుండి బయటికి వెళ్ళిపోయింది.