నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా తర్వాత తన 24వ సినిమాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రాబోతుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగష్టు 30 విడుదల చేయాలనుకుంటే `సాహో` వాయిదా పడడంతో నాని సైడ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమాను సెప్టెంబర్ 13న రాబోతుందని ప్రకటించారు. మరియు ఈ సినిమా ప్రమోషన్లు కూడా ఎప్పుడో మొదలుపెట్టేశారు.
అలాగే అదే రోజు విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చిత్రం తెరకెక్కబోతుంది. పూజా హెగ్డే వరుణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో అయినా ఫామ్‌లోకి రావాలని హరీష్ శంకర్ భావిస్తున్నాడు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెలుగులో హరీష్ వాల్మీకి పేరుతో ఈ సినిమాను తెలుగులో ప్రజెంట్ చేశాడు.
ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించే వరణ్ మెగా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. అయితే `గ్యాంగ్ లీడర్` మరియు `వాల్మీకి` ఒకే రోజు రిలీజ్ కావడం ఆనందంగా ఉందని హరీష్ శంకర్, నానికి విష్ చేస్తూ ట్వీట్ చేశారు. మరియు నాని కూడా హరీష్ శంకర్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ‘థాంక్యూ బ్రదర్` అంటూ వాల్మీకి బృందానికి కూడా తన శుభాకాంక్షలు తెలిపాడు. అయితే నాని ఫ్యాన్స్ హరీష్ శంకర్ ట్వీట్‌పై స్పందిస్తూ మాత్రం హరీష్ శంకర్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు.
హరీష్ శంకర్ మీరు అనవసరంగా మా నానీ సినిమాకు పోటీ వెళ్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే నిజానికి `వాల్మీకి` సినిమా ముందుగానే సెప్టెంబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత `గ్యాంగ్ లీడర్` సినిమా సాహో వాయిదా పడడంతో మూడు రోజుల క్రితం ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే నాని ఫ్యాన్స్ హరీష్‌ను కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.