'సాహో' సినిమా కి ఇదే హైలెట్ సీన్…?
ఇటువంటి నేపథ్యంలో ఆదివారం ఫ్రీ రిలీజ్ వేడుక జరగనున్న క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బయటపడింది. ఇక అసలు మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాకి సంబందించిన డైరెక్టర్ సుజిత్ ఇటీవల చెన్నైలో మీడియా సమావేశం పెట్టిన సందర్భంలో...సుజిత్ మాట్లాడుతూ..సినిమా స్టోరీ అందరికీ బాగుంటుందని కాప్ గా కనిపించనున్న ప్రభాస్ పాత్ర సెకండ్ హాఫ్ సరికొత్త థ్రిల్ ఇస్తుందని అన్నారు.
మెయిన్ గా ఎవరు ఊహించని ట్విస్ట్ అందరికి నచ్చుతుందని సినిమాకి అదే హైలెట్ సీన్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు డైరెక్టర్ సుజిత్. దీంతో సాహో సినిమాలో సెకండాఫ్ లో ప్రభాస్ ఏ విధంగా మారతాడో అని అందరిలో ఉంత్కంట నెలకొంది. ఆగస్టు 30వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా యు.వి క్రియేషన్స్ వారు నిర్వహించబోతున్నారు. మొత్తం మీద ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న ఈ సినిమా కోసం దాదాపు సంవత్సరన్నర కు పైగా సమయం కేటాయించడంతో...ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.