చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!
ఇన్నేళ్ల కెరేరి లో 150 సినిమాలు చేసిన నేను మగధీర - రంగస్థలం వంటి సినిమాల్లో నటించలేదు. ఒకవేళ రంగస్థలం లాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేయడానికి ఒప్పుకునేవాడిని కాను. రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు అని...నటుడిగా రామ్ చరణ్ కి రంగస్థలం సినిమా మైలురాయి అని అదిరిపోయే పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ చేశాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం తన కొడుకు జర్నీ నిర్మాణంలో తెరకెక్కిన ‘సైరా’ సినిమా గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.
‘సైరా’ సినిమా అవుట్ పుట్ అదిరిపోయింది అని సినిమా ఇంత మంచి గా రావడానికి కారణం నిర్మాత చరణ్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇటువంటి కథ కలిగిన సినిమాల్లో నటించాలని చాలాసార్లు అనుకున్నాను కానీ నా కోరిక నా ఆశ నా కొడుకు రామ్ చరణ్ తీర్చాడు అని చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ తెలియజేశారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు త్వరలో రాబోతున్న క్రమంలో మెగా అభిమానులకు సైరా సినిమా టీం టీజర్ విడుదల చేసి అదిరిపోయే రీతిలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.