రూపు మార్చుకున్న బాలకృష్ణ ఆలోచనలోని ఆంతర్యం !

Seetha Sailaja
హీరో నాగార్జునకు ఈ ఏడాది  షష్టిపూర్తి జరగబోతూ ఉంటే వచ్చే ఏడాదికి బాలకృష్ణ షష్టిపూర్తి వయస్సులోకి అడుగు పెట్టబోతున్నాడు. దీనితో పెరిగిపోతున్న వయస్సును లెక్క చేయకుండా  తమ లుక్ ను మార్చుకోవలసిన అవసరం నాగార్జునతో పాటు బాలకృష్ణకు కూడ ఏర్పడింది.  నాగ్ మాదిరిగా తనకు కూడ వయసు పెరగలేదు అంటూ సంకేతాలు ఇవ్వడానికి బాలకృష్ణ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ ఎన్నికలలో తెలుగుదేశం ఘోర పరాజయం షాక్ ల నుండి బయటకు వచ్చిన బాలకృష్ణ లేటెస్ట్ గా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గురించి తన లుక్ ను మార్చుకోబోతున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే తన లేటెస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలియచేసే ఒక ఫోటోను సోషల్ మీడియాలో లీక్ చేసి బాలకృష్ణ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. 

నిన్న మొన్నటి దాకా అతి పెద్ద మొహం భీకరమైన గెడ్డంతో కనిపిస్తూ వచ్చిన బాలయ్య ఇప్పుడు వెరైటీ గెడ్డం చిత్రంగా పైకి దువ్విన క్రాఫ్ తో మిడిల్ ఏజ్డ్ లుక్ లోకి మారిపోయాడు. కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో సి కళ్యాణ్ నిర్మించే సినిమాకోసమే ఈ గెటప్ అన్న ప్రచారం జరుగుతోంది.  ఇక మిగిలింది  లావు తగ్గడమే అని అంటున్నారు. దీనికోసం బాలయ్య ప్రస్తుతం డైటింగ్ లో ఉన్నట్లు సమాచారం.  

ఈ మూవీ త్వర గా పూర్తిచేసి ఆ తరువాత బోయపాటి శ్రీను మూవీని ప్రారంభించే ఆలోచనలలో ఉన్న బాలకృష్ణ వచ్చేఏడాది తన విశ్వరూపాన్ని చూపించాలని స్థిర నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లుక్ ప్రస్తుతం బాలయ్య అభిమానుల మధ్య వైరల్ గా మారడమే కాకుండా బాలయ్య బోయపాటిల మూవీతో బాలయ్యకు తిరిగి పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: