అక్కినేని అఖిల్ పై బెంగ పెట్టుకున్న నాగార్జున..?
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . అయితే ఈ సినిమాకి సంబంధించి అఖిల్ పక్కన హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అదేవిధంగా షూటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తికావాల్సివుంది. కానీ ఏది అనుకున్నట్లు జరగడం లేదు. దీంతో నాగార్జునకి టెన్షన్ మొదలైంది. ఇటీవల అతడు నటించిన 'మన్మథుడు 2' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అదొక బాధలో ఉంటే మరోపక్క చిన్న కొడుకుని హీరోగా సెటిల్ చేయలేకపోతున్నాననేది మరో బాధ నాగార్జున ని వెంటాడుతున్న టు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.
మరోపక్క ఈసారి బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోయే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలనే కసితో ఉన్నాడు అఖిల్. ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అప్పట్లో నాగచైతన్య 100% లవ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదే క్రమంలో అఖిల్ కి కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేస్తున్న సినిమా హిట్టవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని అభిమానులు అఖిల్ కెరియర్ పై బెంగ పెట్టుకున్నారు. వస్తున్న ఈ సినిమాతోనైనా అఖిల్ విజయం సాధిస్తాడో లేదో అని తెగ టెన్షన్ పడుతున్నారు.