బిగ్ బాస్ సీజన్ నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారానికి ఎంటర్ అయ్యింది. ఇక ఎలిమినేషన్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండటంతో బిగ్ బాస్ ఆట రంజుగా మారింది. రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్న హౌస్‌లో బుధవారం మరింత హాట్నెస్ పెంచారు. వీక్లీ టాస్క్‌లో భాగంగా టాలెంట్ షో నిర్వహించారు బిగ్ బాస్. బాబా భాస్కర్, శ్రీముఖి జడ్జెస్‌గా నిర్వహించారు. కంటెస్టెంట్స్ ఆట, పాట, యాక్టింగ్‌లతో ఒకర్ని మంచి ఒకరు పెర్ఫామెన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ రూల్ ప్రకారం మొత్తం పర్ఫామర్స్‌లో నలుగురు మాత్రమే సెకండ్ రౌండ్‌కి వెళ్లనున్నారు.
ఈ క్రమంలోనే అలీ కేవలం లేడీస్ మాత్రమే కాదు నేను హాట్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలను అన్నట్టు స్వింగ్‌జరా పాటతో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేసి పిచ్చెక్కించాడు. దీనికి శ్రీముకి ఫిదా అయిపోయి నాలుగు ఆపిల్ఫీజ్ బాటిల్స్‌ను అందిస్తూ ఇది బోల్డ్ పెర్పామెన్స్ అని పొగడ్తలతో ముంచెత్తింది. అలాగే డాన్స్‌తో ఇరగదీసేందుకు రంగంలోకి దిగిన పునర్నవి, అషూ మాస్ స్టెప్పులతో బిగ్ బాస్ హౌస్‌ను ఊపేశారు. అషూ స్టెప్పులకు ఎట్రాక్ట్ అయిన జడ్జెస్ ఆపిల్ఫీజ్ని డ్రింక్ అందజేశారు.
అలాగే వితిక కూడా కళ్లు లేని అమ్మాయిలా యాక్టింగ్ చేసింది. ఇక రాహుల్ ఏమైపోయావే సాంగ్ మొదలు పెట్టి తడబడుతూ రెండూ సార్లు ఆగిపోయారు. ఈ క్రమంలోనే రాహుల్ గివ్ అప్ ఇచ్చేశాడు. ఇంతలో శ్రీముఖి అందుకుని క్లాస్ పీకడంతో మూడో సారి బాగా ప్రిపేర్ అయ్యి అద్భుతంగా పాడి అందరిని ఆకట్టుకున్నాడు. అలాగే జడ్జెస్ దగ్గర నుండి ఆపిల్ఫీజ్ని సొంత చేసుకున్నాడు.
వరుణ్ సందేశ్ జమైకన్ గెటప్ లో వచ్చి ఉండి పోరాదే సాంగ్ పాడి మనసులు దోచుకున్నాడు. ఫిదా అయిన జడ్జెలు వరుణ్‌కు కూడా ఆపిల్ఫీజ్ డ్రింక్ ఇచ్చారు. అయితే చివరికి జడ్జెలు అలీ, రాహుల్, ఆషూ మరియు వరుణ్‌లకు యాప్పీ ఫీజ్ డ్రింక్స్ అందించారు. చివరిగా వీళ్లు ఫైనల్లో తలపడతారని బిగ్ బాస్ చెప్పాడు.