ఆ హీరోయిన్ ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్!

siri Madhukar
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  అయితే హీరోగా తనకు ప్రత్యేక గుర్తింపు కోసం చాలా కష్టాలు పడ్డారు.  కెరీర్ బిగినింగ్ లో మెగాస్టార్ ప్రభావం పవన్ పై చాలా ఉండేది..అంతే కాదు కొన్ని సందర్భాల్లో చిరుని అనుకరిస్తున్నారని టాక్ కూడా వినిపించింది.  దాంతో తనకంటూ ప్రత్యేకత సాధించుకోవాలని తనదైన మేనరీజాన్ని పవన్ చూపించాడు.  తమ్ముడు, సుస్వాతగం, తొలిప్రేమ ఇలా వరుస విజయాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ పెంచుకున్నాడు. 

ఇక బద్రి, ఖుషి లాంటి సినిమాలతో టాప్ హీరోగా మారిపోయాడు.  గబ్బర్ సింగ్ సినిమాతో మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాన్. ఇదే సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు.  ఓ వైపు సినిమాలు తీస్తూనే రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు పవన్ కళ్యాన్.  నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటాయి.  ఫ్యాన్స్ పవన్ పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇదే సందర్భంగా వినాయక చవితి రావడం మరో ప్లస్ పాయింట్ అయ్యింది. 

ఒకదశలో మిలియన్ల కొద్దీ ట్వీట్స్ తో విషెస్ చెప్పడంతో పవన్ పేరు ఇండియాలో టాప్ 1 ట్రెండింగ్ గా నిలిచింది.  అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం పవన్ నామస్మరణ చేస్తూ  వరుసగా ట్వీట్లు చేశారు. పవన్ తో కలిసి పని చేసిన హీరోయిన్లు కూడా ఆయన విషెస్ చెప్పారు. ఇక 'కొమరం పులి' సినిమాలో పవన్ సరసన నటించిన నికీషా పటేల్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆమె పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. హీరోయిన్ నికిషా పటేల్, అయన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేసింది. 

అయితే, పొరపాటున ఓ రాంగ్ హ్యాష్ టాగ్ ను ట్యాగ్ చేసింది.  అప్పటికే ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం విశేషం.  పవన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. అందులో హ్యాపీ బర్త్ డే పావలా కళ్యాన్ అంటూ ఉండటంతో ఎన్నో విమర్శలు వెల్లెవెత్తాయి. తప్పు గ్రహించిన నికీషా వెంటనే ఆ ట్వీట్ ని తొలగించి పవన్ అభిమానులకు క్షమాపణలు చెప్పి కొత్తగా మరో ట్వీట్ చేసింది. 
My apologies after correction I had forgotten to delete sorry if anyone got hurt. Happy ganesha. #pspk #pawankalyan

— Nikesha Patel (@NikeshaPatel) September 2, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: