"నిశబ్ధం"గా రానున్న అనుష్క .. మరో హిట్ ఖాయమేనా?
అరుంధతి, పంచాక్షరీ , భాగమతి , సైజ్ జీరో వంటి సినిమాలతో తానేంటో అందరికి తెలిసేలా చేసింది అనుష్క. అలాగే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ బాహుబలిలో దేవసేనగా ప్రభాస్ కి సరితూగే నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. మొదటి భాగంలో ముసలి దేవసేనగా .. రెండో పార్ట్ లో రాణి దేవసేనగా కత్తి తిప్పుతూ చాలా అందంగా కనిపించింది. ట్రెడిషనల్ గా చీర కట్టినా ...బీచ్ లో బికినీ వేసినా సరిగ్గా సూట్ అయ్యే అందం అనుష్క సొంతం.
విషయానికొస్తే ... భాగమతి తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం నిశబ్ధం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ అన్ని సిద్ధం చేసింది. ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు 'నిశ్శబ్దం' ఫస్ట్ లుక్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ లుక్కు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. సోలో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న అనుష్క.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.