ఓవర్సీస్ లో  సాహోలో సగం కూడా చేయలేకపోయింది సైరా 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ సైరా  మరి కొద్దీ రోజుల్లో  థియేటర్లలోకి  రానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో  భారీస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈచిత్రం. చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడం అలాగే తొలి తరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత్ర చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుండడంతో ఈచిత్రం ఫై భారీ అంచనాలు  ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లే ఏపీ, తెలంగాణలో కలిపి ఈచిత్రం 115కోట్ల వరకు బిజినెస్ చేసిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల తరువాత కర్ణాటక లో తెలుగు ,కన్నడ వెర్షన్ లకు కలిపి 27కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా  హిందీ లో 25 కోట్లకు ఈసినిమా థియేట్రికల్ హక్కులు అమ్మడైయ్యాయి. మలయాళ , తమిళ  వెర్షన్ ల ప్రీరిలీజ్ బిజినెస్ గురించి తెలియాల్సి వుంది. 




ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఈ సినిమాను 25 కోట్ల కు అమ్మాలనుకున్నాడు  నిర్మాత రామ్ చరణ్.  అయితే  సాహో అక్కడి బయ్యర్ల కు ఇచ్చిన షాక్ తో  అంత ధర పెట్టి కొనడానికి ఎవరు ముందుకు రాలేదు దాంతో  చరణ్ వెనక్కు తగ్గి 20కోట్ల కు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అయితే అప్పటికి ఎవరు సాహసం చేయకపోవడంతో  చివరికి 18కోట్లకు వచ్చాడు. తాజాగా అదే రేటుకు ఈ హక్కులను  ఫార్ ఫిలిమ్స్ దక్కించుకుంది. 



ఇంతకుముందు  ఈసంస్థ  సాహో ను 42 కోట్ల కు దక్కించుకొని ఓవర్సీస్ లో విడుదలచేసింది. అలా సైరా ఓవర్సీస్ లో  సాహో లో సగం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేయలేకపోయింది.  అయితే  ఒక రకంగా  ఇది మంచికే అనుకోవాలి. తక్కువకు అమ్మడం వల్ల  రామ్ చరణ్ కొంచెం నష్టపోయిన ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వస్తే  అక్కడ బయ్యర్లు లాభపడతారు.  ఓవరాల్ గా సైరా  ప్రీ రిలీజ్ విషయంలో 200కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలకానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: