అదో అందమైన అనుభవం : తమన్నా

siri Madhukar
ఫ్యామిలీ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీ డేస్’ మూవీలో తొలిపరిచయం అయ్యింది తమన్నా.  ఈ మూవీ తర్వాత తమన్నా తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు.  మిల్కీ బ్యూటీగా తన అందచందాలతో యంగ్ హీరోల సరసన నటించిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణిస్తుంది.  ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తుంది తమన్నా.  ఆ మద్య రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి ’ మూవీలో అవంతిక పాత్రలో అచ్చం అప్సరస లా కనిపించింది. 

అయితే ఈ మూవీలో తమన్నాకు మంచి పాత్ర ఉన్న పెద్దగా పేరు మాత్రం రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది తమన్నా.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి ’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ లో చిరు సరసన నయనతార నటించింది. అయితే మరో ముఖ్యపాత్రలో తమన్నా నటిస్తుంది. చిరంజీవి కలల ప్రాజెక్టు ని రాంచరణ్ 200 కోట్ల బడ్జెట్ లో నిర్మించడం విశేషం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీతో ప్రేక్షకులని మెప్పించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.   

ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ నటిస్తుండగా..కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్నాడు. తమిళంలో కొంత కలాంగా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ..సైరా మూవీ లోలక్ష్మి పాత్ర నాకు ఓ గొప్ప అనుభూతి కలిగించింది.  ముఖ్యంగా చిరంజీవి సినిమాలో నటించడం నా అదృష్టం అనుకుంటున్న సమయాంలో ఆయనతో కలిసి చేసిన జర్నీ ఇంకా చాలా బాగా అనిపించింది. నా సినీ కెరీర్ లో ‘సైరా’ జర్నీ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు తమన్నా. 'సైరా చిత్రానికి హిందీ డబ్బింగ్ పూర్తి అయ్యింద తెలిపింది. 
Just finished dubbing for the Hindi version of #Syeraa ❤️❤️❤️ #lakshmi
It’s been such an amazing experience being a part of this film , will see you all in theatres very soon... - @tamannaahspeaks on Facebook! #SyeRaNarasimhaReddy #SyeRaaOnOct2nd pic.twitter.com/9PSL7ShbbW

— Konidela Pro Company (@KonidelaPro) September 10, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: