‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
ఇదిలా ఉండగా ఇటీవల భారీ బడ్జెట్తో రిలీజ్ అయిన ‘సాహో’ అనుకున్న అంచనాల్ను అందుకోలేకపోవడంతో ఇప్పుడు ‘సైరా’ ఓవర్సీస్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మాలని చరణ్ ఎంతగా ప్రయత్నాలు చేసినా కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో చివరకు 15 కోట్లకు ఫైనల్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద సాహో సినిమా పరాజయం ప్రభావం చిరంజీవి నటించిన సైరా సినిమా కి భారీగానే పడింది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయపడుతున్నారు.
అయితే మరోపక్క గత కొంత కాలం నుండి తెలుగు సినిమా రంగానికి చెంది స్టార్ హీరోల సినిమాలు ఓవర్సీస్ లో అనుకున్నంతగా కలెక్షన్లు రాబట్టలేకతున్నాయని 'మహర్షి', 'సాహో' సినిమా కలెక్షన్లు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి అంటున్నారు ట్రేడ్ వర్గాలకు చెందినవారు. దీంతో ఓవర్సీస్లో సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదని ఇందువల్లనే 'సైరా' సినిమా ధర చాలా తక్కువ పలికిందని మరికొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలను ఓవర్సీస్లో కొనటానికి బయ్యర్లు తెగ వణికిపోతున్నారు.