కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్‌లోనే లేరు అనిపించుకుంది. ఇదే క్రమంలో వ్యాపార రంగంలో మరో కొత్త రంగంలో రకుల్ ప్రీత్ సింగ్ అడుగుపెట్టింది. అదేంటో కాదు టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఒక టీం కి కో-ఓనర్ గా ఉండటం. ఇదే విషయాన్ని ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో ఆమె ‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ఖరారు చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది.
దీంతో ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో రకుల్ తన జట్టు సభ్యులను తన ఎనర్జీతో ఎంకరేజ్ చేయనున్నారన్న అని అర్దమవుతోంది. ఇటీవలే కింగ్ నాగార్జున తో మన్మధుడు సీక్వెల్ మన్మధుడు 2 లో నటించి పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఈ సినిమా దెబ్బతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ గారికి పెద్ద దెబ్బే పడింది. అయితే సినిమా రంగంలో అవకాశాలు వచ్చినా రాకపోయినా కానీ మరోపక్క వ్యాపార రంగంలో మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా దూసుకుపోతుంది. మొత్తంమీద చూసుకుంటే ఒకపక్క సినిమారంగంలో మరోపక్క వ్యాపార రంగంలో తన సత్తా చాటుతోంది రకుల్ ప్రీత్ సింగ్.