టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ అవ్వడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం అయితే హరీష్ శంకర్ చేయాలని ఉన్నా గానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు అప్పుడే హరీష్ తో సినిమా చేసే ఆలోచనలో ఎన్టీఆర్ లేనట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. టెంపర్ సినిమా నుండి వరుస హిట్లు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్..అదే సక్సెస్ కెరియర్లో కొనసాగించడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి తో చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వరుసగా చాలా మంది స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టినట్లు ఇండస్ట్రీ లో టాక్ వినపడుతోంది. ఇదిలా ఉండగా వాల్మీకి సినిమా గురించి మరియు ఆ సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ గురించి అనేక విషయాలు డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. కాగా వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ మొట్టమొదటిసారి మాఫియా టైప్ క్యారెక్టర్ చేయడం తో సినిమాపై మెగా అభిమానులు గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు.