సైరా లో తమన్నా పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఇప్పుడు బాధపడుతున్నరా ?
ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ బ్యూటీ తమన్నా లక్ష్మీ అనే ఒక క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో కనిపించనుంది. సైరా సినిమాలో తమన్నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా కనబడుతుంది.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో తమన్నా విజ్యువల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. తమన్నా మంచి డ్యాన్సర్ కావడంతో క్లసికల్ డ్యాన్సర్ పాత్రలో ఒదిగిపోయింది.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ పాత్ర కోసం మొదటి ఛాయిస్ తమన్నా కాదట. ఈ పాత్ర కోసం కొంత మంది స్టార్ హీరోయిన్స్ సంప్రదించారట. అందరూ ఆ ఆఫర్ ని రిజక్ట్ చేశారు. కొంత మంది చిరంజీవి తో నటిస్తే తమ కెరియర్ కు సమస్య అవుతుందని. మరికొందరు నయనతార నసింహారెడ్డి భార్యగా నటిస్తుంది కాబట్టి తనకు ఇంపార్టన్స్ ఉండదని ఈ పాత్రను రిజక్ట్ చేశారట. తమన్నా ఇలాంటివి ఆలోచించకుండా ఆ పాత్రను ఒప్పుకుంది సైరా ట్రైలర్ చూసి ఆ ప్రాత్రను మిస్ చేసుకున్నందుకు వారందరు బాధపడుతున్నరటా
.సైరా కు సంబంధించిన ప్రమోషన్స్ నయనతార రావడం లేదు కాబట్టి మీడియా ఫోకస్ మొత్తం తమన్నా కు లభిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే తమన్నా కెరియర్ కి మంచి బూస్ట్ దొరుకుతుంది. అక్టోబర్ 2న విడుదల అవుతున్న సైరా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.