కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
17 వయసు కలిగిన ఆ అభిమాని...నీకు తెలుగు రాకపోయినా పెళ్లి చేసుకుని తెలుగు నేర్పిస్తా అంటూ కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేయడంతో...అది చూసిన కాజల్.. వయసులో తన కన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకోనంటూ ఆ ప్రపోజల్ కి నో చెప్పింది. ఇదే సందర్భంలో మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు అని మరొక ఫాలోవర్ కాజల్ అగర్వాల్ ని ప్రశ్నించగా...సదరు ఫాలోవర్ కి సమాధానంగా.. తనకు వివాహ బంధంపై ఆసక్తి ఉందని.. అన్నీ కుదిరినప్పుడు పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటానని ప్రకటించింది కాజల్.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సౌత్ లో కోలీవుడ్ ఇండస్ట్రీలో కమలహాసన్ - శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సీక్వెల్ సినిమా మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో 'ముంబై సాగా' అనే రెండు సంచలన ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే తాజాగా తన ట్విట్టర్ ఎకౌంట్లో ఫాలోవర్ ల సంఖ్య 3 మిలియన్లు చేరటంతో అభిమానులతో కాసేపు ముచ్చటించడం జరిగింది. దీంతో కాజల్ అగర్వాల్ కి టీనేజ్ కుర్రాడు ప్రపోజ్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.