బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు అందరు ఇప్పుడు తెలుగు సినిమాలనే ఫాలో అవుతున్నారు. హిందీ అంటే రొమాన్స్ కి కేరాఫ్ అన్న విషయం తెలిసిందే.. తెలుగు అంటే దేవుడు సినిమాలు ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అవ్వడంతో ముందుంటుంది. ఎక్కడ చూసుకుంటే రెండు సినీ ఇండస్ట్రీస్ పద్ధతిని మార్చుకున్నట్లు ఉన్నాయి. ఇది అక్కడ.. అది అన్నట్లు మారింది.
విషయానికొస్తే.. తెలుగు సినిమాలపైనా హిందీ సినిమాల ప్రభావం బాగానే పడిందని అర్థమవుతుంది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న సినిమాలన్నీ కూడా రొమాన్స్ తో రెచ్చిపోతున్నాయి. మరో విషయమేంటనే అక్కడి సినీ తారలు ఇక్కడకొచ్చి అదే రొమాన్స్ రుచు చూపిస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన సాహో సినిమాలో శ్రద్దా కపూర్ నటించి ప్రదాస్ కు రొమాన్స్ చేయడం నేర్పించింది.
ఇకపోతే తెలుగు ఓరియెంటెడ్ సినిమాలో బాలీవుడ్ లోకి పాకాయి. బాలీవుడ్ అరుంధతి సినిమా రాబోతుంది. ఆ సినిమాలో కరీనా కపూర్ బయపెట్టబోతుంది అనే టాక్ వినపడుతుంది. తెలుగులో వచ్చిన అరుంధతి సినిమా లో అనుష్క నటన ఓ రేంజులో ఉండటంతో సినిమా కూడా ఓ రేంజులో హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా హిందీలో రాబోతుంది. ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తుంది.
అది కనుక నిజమైతే కరీనా పెర్ఫామెన్స్ కూడా ఓ రేంజులో ఉంటుంది. ఇదిలా ఉంటే, శనివారం పుట్టిన రోజు జరుపుకున్న కరీనా బాలీవుడ్లో బెబోగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొట్టొచ్చే అందం, నటనలో లీనమై నటించడం ఆమె కే సొంతం. 'రావణ్', 'సింగం రిటర్న్స్', 'బాడీగార్డ్', '3 ఇడియట్స్', 'బజరంగీ భాయిజాన్', 'దేవ్', 'ఐత్రాజ్', 'ఓంకార' వంటి సినిమాల విజయాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 'గుడ్ న్యూస్', 'ఆంగ్రేజి మీడియమ్' సినిమాలలో నటిస్తుంది.