అరె.. 'సైరా నరసింహారెడ్డి'కి పోటీ ఎక్కువైంది !
టాలెంటెడ్ అండ్ షార్ప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని చిత్ర పరిశ్రమల నుండి మెగాస్టార్ సినిమాకి పోటీగా ఎవరు తమ సినిమా విడుదల చెయ్యాలనుకోలేదు. ఒక్క బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ తప్ప. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మాత్రం అక్టోబర్ 2న తమ సినిమా విడుదల చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్' హిందీతో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2నే రానుంది. కానీ 'సైరా' దెబ్బకి ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతుందని మొదట అనుకున్నప్పటికీ.. వార్ సినిమాని అనుకున్న డేట్ కే.. మెగాస్టార్ కి పోటీగా విడుదల చేసేలా ప్లాన్ చేశారు. మరి వీరు మెగా స్టార్ కి పోటీని ఇవ్వగలరా.. సైరాలో అమితాబ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో సైరా పై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే హాలీవుడ్ భారీ చిత్రం 'జోకర్' కూడా అదే రోజున రానుంది. హిందీలో మంచి క్రేజ్ ఉన్న ఈ చిత్రాన్ని మొదట 4వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుని ఇప్పుడు అనూహ్యంగా 2వ తేదీకి తీసుకోస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు భారీ సంఖ్యలో థియేటర్ల కేటాయింపు ఉంటుంది. మొత్తానికి 'సైరా' విపరీతమైన పోటీ తప్పదు.
కాగా సైరా చిత్ర టీమ్ త్వరగా ప్రచార కార్యక్రమాల్ని స్టార్ట్ చేసి 'ట్రైలర్' ద్వారా తెచ్చుకున్న క్రేజ్, అంచనాల్ని పెంచుకుంటూ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం తక్షణమే చేయాలి. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు మరియు హిందీ ప్రేక్షకులే కాకుండా.. కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్', అలాగే జోకర్ సినిమాలు 'సైరా'కి ఏ రేంజ్ పోటీ ఇస్తాయో చూడాలి. అయితే వార్ పై ఇప్పటికే బాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. పైగా హృతిక్ రోషన్ నుండి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవ్వడం కూడా వార్ కి మంచి అవకాశం. మరి సైరా ఎలా నిలబడగలడో.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Director
-
Reddy
-
Chiranjeevi
-
uyyalawada narasimha reddy
-
October
-
Mohandas Karamchand Gandhi
-
Cinema
-
Chitram
-
Audience
-
Yevaru
-
bollywood
-
Hrithik Roshan
-
Tiger Shroff
-
Jayanthi
-
Smart phone
-
war
-
Amitabh Bachchan
-
Saira Narasimhareddy
-
Hindi
-
vijay
-
Joseph Vijay
-
Telugu
-
Kannada
-
Tamil
-
nayantara
-
Ram Charan Teja
-
anand malayalam actor
-
Anand Deverakonda
-
Joker