కార్తి  సినిమాకి  తప్పని మనోభావాల దెబ్బ .. షూటింగ్  ఆగిపోయింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో  సినిమాలు తీయడం  మేకర్స్  కు  సవాలు గా మారింది.  కథ దొరకనో లేక  బడ్జెట్ లేకనో  కాదు సినిమా తీస్తే దాని వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తింటాయోనని  భయపడుతున్నారు.  కథ  దగ్గరనుండి   టైటిల్ ,  పోస్టర్ల వరకు  ఏ ఒక్క విషయంలో  అజాగ్రత్తగావున్నా.. మనోభావాలు  దెబ్బ తిన్నాయని రచ్చ చేయడానికి  ఓ వర్గం రెడీ గా ఉంటుంది.  షూటింగ్ లను ఆపడం అంతటితో ఆగకుండా కేసువేసి  చిత్ర యూనిట్ ను కోర్టులు చుట్టూ తిప్పించడం ఇటీవల  కొందరు ఇదే పనిగా పెట్టుకున్నారు.  వీరి దెబ్బకు  ఆసినిమా మేకర్స్ కూడా దిగి రాక తప్పడం లేదు.  {{RelevantDataTitle}}