సైరా ను కబళిస్తున్న జోకర్ !

Seetha Sailaja
‘సైరా’ విడుదలకు ఇక కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ఈ మూవీకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలిందని బాలీవుడ్ మీడియా కామెంట్స్ చేస్తోంది. ‘సైరా’ జాతీయ మూవీగా ప్రమోట్ చేస్తున్న నేపధ్యంలో ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేయాలి అంటే ఈ మూవీ ఎట్టి పరిస్థితులలోను బాలీవుడ్ లో కూడ సంచలనాలు సృష్టించాలి.

ఇప్పటికే ఈ మూవీని కార్నర్ చేస్తూ హృతిక్ రోషన్ ‘వార్’ విడుదల అవుతున్న నేపధ్యంలో ‘సైరా’ కు గట్టి పోటీ బాలీవుడ్ లో ఏర్పడింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ నటించడంతో పాటు యష్‌ రాజ్‌ సంస్థ నిర్మించడంతో ఈ మూవీ ప్రమోషన్ చాల భారీ స్థాయిలో చేస్తున్నారు. 

సాధారణంగా యష్ రాజ్ సంస్థ నిర్మించిన సినిమాలకు ఫెయిల్యూర్స్ తక్కువ. దీనికితోడు ఈ మూవీని తెలుగు తమిళ కన్నడ మళయాళ భాషలలో కూడ డబ్ చేసి ‘సైరా’ తో అదేరోజు విడుదల చేస్తూ చిరంజీవికి యష్ రాజ్ సంస్థ ఊహించని షాక్ ఇస్తోంది. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా భారీ అంచనాలు ఉన్న హాలీవుడ్ మూవీ ‘జోకర్’ ను కూడ అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.

వాస్తవానికి మంచి అంచనాలు ఉన్న ఈ ‘జోకర్’ అక్టోబర్ 4న విడుదల చేస్తారు అని ముందుగా ప్రకటించి ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను అక్టోబర్ 2కు మార్చారు. ఈ హాలీవుడ్ మూవీ పై కూడ బాలీవుడ్ మల్టీప్లెక్స్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో ఉత్తరాది రాష్ట్రాలలోని పెద్ద నగరాలలోని ప్రేక్షకులు ‘సైరా’ కంటే ‘వార్’ ‘జోకర్’ సినిమాలను చూడటానికి ఎక్కువ చూడటానికి ఆస్కారం ఉంది. దీనితో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన మల్టీ ప్లెక్స్ ధియేటర్స్ తో పాటు సింగిల్ ధియేటర్స్ కూడ ‘సైరా’ కలక్షన్స్ కు గండిపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: