'అల' కే హైలెట్ గా నిలవనున్న "సామజవరగమన..!"

Kunchala Govind
అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలలో మన మాటల మాంత్రీకుడు బన్నీ ని ఏ రేంజ్ లో చూపించారో అందరికి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ళకు వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సారి 'అల వైకుంఠపురములో' సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 2020 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో పోటీకి సిద్దమవుతుంది. అందుకే శరవేగంగా 'అల' షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం అక్టోబర్ 10 వరకు ఫినిష్ అవుతుందని తాజా సమాచారం. 

ఇక ఈ సినిమా నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది. 70 మంది ఆర్కెస్ట్రా.. 35 మంది బ్యాండ్ బృందం.. ఎంతో శ్రద్ధగా పని చేస్తే పుట్టుకొచ్చిన పాట అంటు తన ఆనందాన్ని వ్యక్తపరచారు ఎస్.ఎస్.థమన్.  'అల వైకుంఠపురములో' సినిమాకి థమన్ సంగీత దర్శకత్వంలో పాటలు రెడీ అవుతున్నసంగతి తెలిసిందే. ఇందులో 'సామజవరగమన' అనే తొలి పాటను రికార్డింగ్ చేస్తున్నారు. ఈ మెలోడీని కంపోజ్ చేయడానికి చాలా ఎగ్జయిట్ అయ్యాడట తమన్. ఇక దీనికోసం పూర్తిగా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆధారపడలేదని చెబుతున్నాడు. 

ఈ సందర్భంగా తమన్.. బన్నికి పాటలు చేయడం అంటే కాస్త కష్ఠమే...చాలా ఆలోచించాలి. బన్ని డ్యాన్సులకు తగ్గట్టు ఏదైనా పాటను చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి... తన కొరియోగ్రఫీ డిఫరెంటుగా ఉంటుంది... అంటు ఇంతకుముందు రేసుగుర్రం.. సరైనోడు సినిమాలకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ని గుర్తు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ - బన్ని తో వర్క్ చేస్తున్నా. వారి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్. వీళ్లతో పనిచేసే విధానం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాగే 'సామజమరగమన' అనే పాటను చేయాలని ఐడియా ఇచ్చారు. నేచురల్ సౌండ్స్ తో ఈ పాటను చేయాలనుకున్నాం. పిల్లనగ్రోవి తో సహా వయోలిన్.. మిగతా లైవ్ ఇన్ స్ట్రుమెంట్స్ వాడాను. ఇక ఈ పాటకు సీతారామ శాస్త్రి గారు సాహిత్యమందించడం చాలా ఆనందంగా ఉంది... అంటు బన్నీ తో పాటు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన  'సామజవరగమన' పాట మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: