అలాంటి చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు మాష్టర్....మహేష్ బాబు
అదే ఇమేజ్ తో రవిబాబు దర్శకత్వంలో తాజాగా రాబోతున్న చిత్రం ‘ఆవిరి’.ఇటీవల ఈ సినిమా టీజర్స్ రిలీజ్ అయంది అని అందరికి తెలిసిందే. కాగా ఆవిరి సినిమా టీజర్ ను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ‘అన్ని సినిమాలతో పోలీస్తే ఈ హారర్ జానర్ మూవీసే ఎక్కువుగా ఆసక్తికరంగా ఉంటాయి, చాల ఇంట్రెస్ట్ గా ఉంటాయి అని తెలిపారు.
అలాంటి హారర్ మూవీస్ ను తీయడంలో మొదటి స్థానం రవిబాబు మాష్టర్’.. ‘ఆవిరి’ సినిమా యూనిట్ కి మరియు డైరెక్టర్ రవిబాబుకి ఆల్ ది బెస్ట్’ అని మహేష్ బాబు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. ఇక గత సినిమాలు రవిబాబుకి సరైన హిట్ లభించలేదు. ఆయన చివరి ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’ కూడా విజయానికి నోచుకోలేదు.