సైరా తో మెగాస్టార్ వైభవం దిగజారింది - విమర్శకులు సైతం విఫలమయ్యారు

మనదేశ ప్రజల చేతే కాదు, బ్రిటీష్ తదితర వలస పాలకుల చేత సైతం అగౌరవం మూటగట్టుకున్న వ్యవస్థ పాలెగాళ్ళ వ్యవస్థ. బ్రిటీష్ లేదా వలస పాలకుల ప్రతినిధులుగా ఉంటూ ప్రజలను పీడించి పన్నులు వసూల్ చేసే వీళ్ళని నాడు  భారత జాతి అసహ్యించుకుంది. అలా ప్రజా పీడన ద్వారా వసూలు చేసిన పన్నులను పూర్తిగా బ్రిటీష్ వాళ్ళకు కట్టకుండా తమ స్వార్ధం చూసుకునే వీళ్ళని బ్రిటీష్ వాళ్ళు సైతం అసలు నమ్మలేదు. సరికదా ఫుల్లుగా వాడేసుకున్నారు. అలాంటివాడు తనకు రావలసిన భరణం కోసం బ్రిటీష్ ప్రాంతీయ ప్రతినిధులపై దాడి చేసిన సందర్భాన్ని "స్వాతంత్ర పోరాటం" గా మలచటమే చాలా ధారుణం. 


అందుకే ఈ సినిమాలో ఎమోషన్లు పండే ప్రసక్తి లేదు. ముగ్గురు భార్యలతో బహువిలాసజీవితం అనుభవించిన ఉయ్యాలవాడ జీవితాన్ని గత తరం మహానటులు ఎన్ టీ ఆర్ కాని సూపర్ స్టార్ కృష్ణగాని పరిశీలించక పోవటానికి ఇదే ప్రధాన కారణం. త్యాగం, భావావేశం లేని కథను ఎలా చూపినా అది "సెల్లింగ్ ప్రోడక్ట్" గా వినియోగదారుల్లో నిలవదు అనేది నగ్న సత్యం.    


అందుకే స్వాతంత్ర యోధుడుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి – సైరా – కథ అసలు అమ్మకానికి పనికొచ్చే పదార్ధం కాదు. అసలు "సెల్లింగ్ పాయింట్ మెగస్టార్  చిరంజీవి నటించటం" మాత్రమే. 



సైరా ఒక స్వాతంత్ర సమరయోధుడు వీరం, ధీరం, శౌర్యం, పరాక్రమం, పౌరుషం, ఔన్నత్యం, ధీరోదాత్తతకి ప్రతీకగా అనుకుంటే లేదా ఈ  కథను చరిత్ర అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అసలు మూలంలోనే సంధి కొట్టినట్లే – కారణం ఒక పాలెగాడు పాత్రను స్వాంత్ర సమర యోధుడుగా చెప్పటం. చిరంజీవి ఈ పాత్రను పోషించటంలోనే అనౌచిత్యం ఉంది.  విదేశీయుల కొరకు తన సోదర భారతీయుల నుండి పన్నులు వసూలు చేసే ఒక ఒక నీతిలేని పాలెగాడికి అంత ఉదాత్తతతో గూడిన గుణం, లేదా ఆయన చరిత్రకు అంత దృశ్యం ఉండే ప్రశ్నే ఉండదు. చరిత్ర దారి మళ్ళించిన ఈ సినిమాను చాలా మంది సినీ క్రిటిక్స్ పొగటంలో నిమగ్నమయ్యారు.  



చావు కబురు చల్లగా అంటే “ఇది చరిత్ర కాదు కల్పన" అని చెప్పేసి దర్శకుడు బయట పడిపోయాడు. లేకుంటే విమర్శల జడివానకు "సైరా" బలవ్వాల్సివచ్చేది. ‘ఇది చరిత్ర కాదు కల్పిత కథ మాత్రమే’ అని  సురేంద్రరెడ్డి, చిరంజీవికి, సినిమాకు ఎంతో కొంత మేలు చేశారు. అభిమానుల ఉత్సాహం పై కొంచెం నీళ్ళు చిలకరించినా మంచిదే అయింది. 


చరిత్ర కాకపోయినా "బాహుబలి" లాంటి కాల్పనిక కథ  సినిమాగా చరిత్రలో నిలబడ లేదా! అలాగే  సైరా చరిత్ర కాకపోయినా కల్పితగాధ గానే నిలబడి ఉండేది కాని పాలెగాళ్ళ పై గౌరవం లేని ప్రజలు ఈ కథను గౌరవించరు. 


అయితే షష్టి పూర్తి తరవాత కూడా చిరంజీవి నవయవ్వన చాయలతో ధీరోదాత్త పాత్రలో ధీరత్వంతో ప్రేక్షకులకు రోమాంచితం చేసినా, నటజీవన సాయం సమయంలో మెగాస్టార్ ఇలాంటి పాత్రలో నటించటం నటుడుగా ఆయన పాతాళానికి దిగజారినట్లే తీరు -  ఒక పాలెగాడు తనకు రావలసిన భరణం కోసం మాత్రమే పోరాడిన కథను దారితప్పించి ఆ పాత్రలో నటించటం మెగాస్టార్ వ్యక్తిత్వాన్ని క్రిందికి దించినట్లే.


సంగ్రామమే కాని ఈ పాలెగాడి కథను మొదటి స్వాతంత్ర సంగ్రామం అని ప్రచారం చేసిన తీరు గర్హనీయం. అలా అనాలంటే అయితే 16వ శతాబ్దములో పోర్చుగీసు వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా నాలుగు దశాబ్ధాలు పోరాడి వారిని నిలువరించిన ‘రాణి అబ్బక్క’ (1525-1570) పోరాటాన్ని భారత్ లో వలసవాదులపై జరిగిన తొలి స్వాతంత్ర సమరంగా చెప్పవచ్చు ఆ తరవాత బ్రిటీష్-ఇండియా చరిత్ర గుర్తించిన “సిపాయిల తిరుగుబాటు - ఝాన్సిరాణి లక్ష్మిబాయి నేతృత్వాన జరిగిన సంగ్రామం"  అని అందరికీ తెలుసు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: