' సైరా ' కు ఫ‌స్ట్ డే పెద్ద ఎదురు దెబ్బ‌...

VUYYURU SUBHASH
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన సైరా సినిమాకు తొలి రోజే పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఓ వైపు సినిమాకు భారీ బ‌డ్జెట్ పెట్టేశారు. పాన్ ఇండియా సినిమాగా ప్ర‌చారం చేసేశారు. అక్క‌డితో బాగానే ఉన్నా ఈ సినిమాకు తెలుగులో మిన‌హా మిగిలిన లాంగ్వెజెస్‌లో అంత సీన్ లేద‌ని తొలి రోజు వ‌సూళ్లే చెప్పేశాయి.


సైరా సినిమా క‌న్నా సైరాలో మెగాస్టార్ చిరంజీవి న‌ట‌న‌కు అటు ప్రేక్ష‌కుల‌తో పాటు... ఇటు ఫిలిం క్రిటిక్స్ వరకు సైరా చిత్రం పై, చిరు నటనపై మరియు దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్ర‌శంస‌లు.. క‌లెక్ష‌న్లు అన్ని కేవ‌లం తెలుగు వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యేలా ఉన్నాయి. మిగిలిన భాష‌ల్లో సైరా ప‌రిస్థితి ఘోరంగా ఉంది.


ఇక హిందీలో సాహో లాంటి డిజాస్ట‌ర్ సినిమా ఏకంగా రు.153 కోట్ల షేర్ రాబ‌ట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఓ ప్లాప్ సినిమాకు అక్క‌డ అంత షేర్ రావ‌డంతో తెలుగు ట్రేడ్ వ‌ర్గాలు సైతం ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాయి. అయితే సైరా ప‌రిస్థితి మాత్రం అక్క‌డ ఘోరాతి ఘోరంగా ఉంది. సైరా హిందీ వర్షన్ మొదటి రోజు కేవలం 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందంటేనే సైరాను బాలీవుడ్ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించార‌ని క్లీయ‌ర్‌గా తెలుస్తోంది.


హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోలు న‌టించిన భారీ బ‌డ్జెట్ సినిమా వార్ అక్క‌డ తొలి రోజే రు.50 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. హాలీవుడ్ మూవీ జోకర్(6కోట్లు) చిత్రం కంటే కూడా సైరా వసూళ్లు తక్కువ కావడం గమనార్హం.


ఇక అటు త‌మిళ్‌లోనూ సైరాను జ‌నాలు ప‌ట్టించుకోలేదు. ఒక్క చెన్నై సిటీలో మాత్ర‌మే సైరాకు మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. కోలీవుడ్‌లో బుధ‌వార‌మే మ‌రో రెండు సినిమాలు రిలీజ్ అవ్వ‌డంతో అక్క‌డ కూడా సైరాకు షాక్ త‌ప్ప‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: