త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పై అక్కినేని హీరో కామెంట్..?
ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో సుశాంత్ చేస్తున్న పాత్ర పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఇటీవల వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద చర్చగా అల వైకుంఠ పురంబులో సుశాంత్ క్యారెక్టర్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ కి అన్నయ్యగా నటిస్తున్నారంటే మరో కొంతమంది లేదు లేదు హీరోయిన్ పూజా హెగ్డే కి బ్రదర్ గా నటిస్తున్నారని తెగ మాట్లాడుతున్నారు.
ఇలా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లుగా సుశాంత్ పాత్ర గురించి మాట్లాడుకుంటున్న నేపద్యంలో ఈ వార్తలు పెద్ద వైరల్ గా మారటం తో. సుశాంత్ ఎట్టకేలకు స్పందించాడు. తాను బన్నీకి బ్రదర్ని కాదు.. అదృష్టవశాత్తు పూజా హెగ్డేకు కూడా అన్నయ్యను కాదు. అసలు నా పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయండి అని ట్వీట్ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో సస్పెన్స్ మళ్లీ మొదటికొచ్చినట్లైంది. కాగా ఈ సినిమాలో టాబు ఒక కీలక పాత్ర చేయటం విశేషం. రాబోయే సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.