చరణ్ పై తమన్నా ఏకవచన సంభోధనతో షాక్ అయిన చిరంజీవి !

Seetha Sailaja
నిన్న జరిగిన ‘సైరా’ సక్సస్ మీట్ లో జరిగిన ఒక అనుకోని సంఘటనకు  మీడియా వర్గాలతో పాటు చిరంజీవి కూడ షాక్ అయ్యాడు. ఇప్పటి తరం యంగ్ హీరో హీరోయిన్స్ మధ్య చాల సాన్నిహిత్యం ఉంటోంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్ అయినా నిన్నటి మీడియా మీట్ లో తమన్నా చరణ్ ను చనువుగా ‘రా’ పిలవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఈ మూవీలో నటించే అవకాశం తనకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యూనిట్ సభ్యులు అందరి గురించి పేరుపేరునా ప్రస్తావిస్తూ చరణ్ దగ్గరకు వచ్చే సరికి తమన్నా ఎవరు ఊహించని పదం వాడింది. ‘చరణ్ నువ్వు కో యాక్టర్ గా బెటర్ నా ప్రొడ్యూసర్ గా బెటర్ నా ఏం చెప్పాలి రా’ అంటూ కామెంట్ చేసింది. ఈ మాట తమన్నా నోటివెంట రాగానే ఆ మీడియా మీట్ కు వచ్చిన వారంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.