తన పెళ్లి గురించి ప్రశ్న అడిగిన మీడియా కి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన కాజల్..!
కెరీర్ పరంగా చాలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో కాజల్ పెళ్లి గురించి రకరకాల షాకింగ్ వార్తలు వినపడుతున్నాయి. అప్పట్లో భారీ బిజినెస్ మాన్ తోకాజల్ అగర్వాల్ ప్రేమలో ఉన్నట్లు రకరకాల వార్తలు రావటం జరిగాయి. ఆ సమయంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోతుందని అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఆమెకు సౌత్ లో స్టార్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్లు రావడంతో సౌత్ లో కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోయింది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కెరియర్ చాలా జోరుగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. దాదాపు రాబోయే మూడు సంవత్సరాల పాటు ఆమె కెరీర్ కి ఎటువంటి ఢోకా లేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఒక టీవీ చానెల్ కార్యక్రమంలో మీడియా వాళ్లు కాజల్ కి పెళ్లి ప్రస్తావన గురించి ప్రశ్న వేయగా...షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకు నచ్చినవాడు దొరికితే చేసుకుంటాను అంటూ చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం ‘క్వీన్, ఇండియన్-2, ముంబై సాగా, కాల్ సెంటర్’ అనే సినిమాల్లో నటిస్తున్న కాజల్ తమిళం, హిందీ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.