సైరా ఫలితంతో కొరటాల పై ఒత్తిడి పెంచిన చిరంజీవి !

Seetha Sailaja
‘సైరా’ ఫైనల్ రిజల్ట్ తేలిపోవడంతో ఈమధ్య చిరంజీవిని దర్శకుడు కొరటాల శివ కలిసి తన మూవీ ప్రాజెక్ట్ గురించి చిరంజీవి అభిప్రాయాలు తీసుకున్నట్లు టాక్. ఈ సందర్భంలో చిరంజీవి కొరటాలతో చేసిన కామెంట్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. 

‘సైరా’ షూటింగ్ వల్ల తాను మనస్పూర్తిగా నవ్వి రెండు సంవత్సరాలు అయిందని ఈ మూవీలో తన అభిమానులు తన దగ్గర నుండి కోరుకునే స్టెప్పులు కామెడీ మిస్ అవ్వడంతో తన అభిమానులు కూడ ‘సైరా’ చూసి పూర్తిగా సంతృప్తి పడలేదు అన్న విషయం తనకు అర్ధం అయింది అంటూ చిరంజీవి కొరటాలతో అన్నట్లు టాక్. అంతేకాదు కొరటాలతో తాను నటించబోయే సినిమాలో తన మార్క్ స్టెప్స్ అదేవిధంగా కామిడి మిస్ కాకుండా చూసుకోమని చెపుతూ ఈ మూవీని నవంబర్ లో మొదలు పెట్టే విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

దీనితో కొరటాల మూవీ ప్రాజెక్ట్ కు ఊహించని సమస్య వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కొరటాల సినిమాలు అన్నీ కూడ కథా బలంతో నడుస్తూ ఉంటాయి. అతడి సినిమాలలో అనవసరపు కామెడీ సీన్స్ ఎక్కడా కనిపించవు. ఇక డాన్స్ పాటల విషయానికి వస్తే కొరటాల సినిమాలో పాటల ట్యూన్స్ బాగుండటమే కాకుండా ఆ పాటల చిత్రీకరణ స్టెప్స్ అన్నీ బాగుంటాయి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల చిరంజీవితో ఎంచుకున్న కథ ఒక సీరియస్ పాయింట్ తో కూడుకున్నది అని తెలుస్తోంది.

ఈ మూవీలో మాస్ ప్రేక్షకుల కోసం చిరంజీవి చేత ద్విపాత్రాభినయం చేయించి పాటలు స్టెప్స్ అలాంటివి పెట్టినా కామెడీ విషయం దగ్గరకు వచ్చేసరికి చిరంజీవి కోరుకున్న కామెడీ సీన్స్ ఈ మూవీలో ఎలా చూపించాలి అన్న విషయమై కొరటాల తన స్టోరీ టీమ్ తో చాల సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ‘సైరా’ ఫలితం ఊహించిన స్థాయిలో లేకపోవడంతో కొరటాల పై ఒత్తిడి బాగా పెరుగుతోందని దీనిని కొరటాల తట్టుకుని సక్సస్ సాధించదానికి కొరటాల ఆలోచనలలో చాల మార్పులు చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: