నిర్మాతని ఆదుకున్న రజనీ..!
విషయంలోకి వెళితే రజనీకాంత్ హీరో అవటానికి సదరు నిర్మాత ఎక్కువ చొరవ తీసుకున్నట్లు అయితే ఆ నిర్మాత చాలా ఆర్థిక నష్టాల వల్ల అద్దె ఇంట్లో ఉంటున్నారు అని తెలుసుకున్న రజినీకాంత్ సదరు సినిమా నిర్మాత కి ఇల్లు కట్టిస్తానని రజనీ మాట ఇచ్చారట ఆ నిర్మాత కి సంబంధించిన ఓ సభలో. ఆ సభలో రజినీకాంత్ ఏం మాట్లాడారంటే.. నా మొదటి సినిమా నిర్మాత కలైజ్ఞానం లేకుంటే నేను కథానాయకుడిగా నిలదొక్కుకునేవాడిని కాదని విలన్ గా ఉన్న నన్ను హీరోగా చూపించి మంచి జీవితాన్ని ఇచ్చారని ఆ సభలో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు గడవకముందే గృహ ప్రవేశం చేయించారు.
గత నెలలో సీనియర్ కథారచయిత, నిర్మాత కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది. చెన్నై లో జరిగిన ఈ సభకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్ లో రజినీకాంత్ ప్రభుత్వం ఆదుకోకముందే తన కెరీర్ సక్సెస్ కి ముఖ్య కారణమైన కలైజ్ఞానం ఇల్లు ఏర్పాటుచేస్తానని అన్నారు. నెల రోజులు గడవక ముందే రజినీకాంత్ సదరు నిర్మాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తాజాగా ఇంటి గృహప్రవేశం నిర్మాతతో రజినీకాంత్ చేసినట్లు సమాచారం.