పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
దీంతో ఈ నెల 19న రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 'బాహుబలి' స్కోర్ లైవ్ కాన్సెర్ట్ ఉంది. సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో జరగనున్న ఈ లైవ్ షోకి రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క కూడా వెళ్తున్నారు. షో జరిగిన నాలుగు రోజులకు ప్రభాస్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. కాబట్టి ఈవెంట్ అయిన తరువాత లండన్ లో మరో వారం రోజులు పాటు ఉండి తన పుట్టినరోజుని లండన్ లోనే ప్రభాస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి.
అయితే ఈ వేడుకలో అనుష్క కూడా ఉండబోతున్నట్లు వార్త రావడంతో...ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు గతంలో మాదిరిగా ప్రభాస్ అనుష్క జంట పై రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వీరిద్దరూ చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చిన...రూమర్లు వస్తూనే ఉండటం గమనార్హం. మొత్తంమీద ఈ రూమర్లకు పులిస్టాప్ పడాలంటే వీరిద్దరిలో ఏ ఒక్కరికైనా పెళ్లి కావాల్సిందే అని కొంతమంది నెటిజన్లు చేస్తున్న కామెంట్ పై వ్యాఖ్యానిస్తున్నారు.