ముద్దు ముద్దుకు తేడా ఉంది - ఆమె ముద్దుకు నా ముద్దుకు పోలికే లేదు

ఈ మద్య సినీ తారలు వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. శృంగారం పిడికిట్లో ఉంటే దాగి ఉంటే అందం, ఆననదం, ఉద్వేగం, ఉత్సాహం. దాని పిడికిలి విప్పితే అసహ్యం. 

‘రష్మికా మండన్నా ముద్దుకి, నా ముద్దుకి అస్సలు పోలికే లేదు’ అంటున్నారు యువ కథానాయిక హరిప్రియ. ఈమే గతంలో ‘తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా’ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ఈ బ్యూటీ కూడా కర్ణాటక నుండి దిగుమైన కన్నడ భామే. ‘జై సింహా’ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలోను ఈ భామ కనిపించలేదు. 

హరిప్రియ కన్నడలో మాత్రం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. తేజస్వి దర్శకత్వంలో హరిప్రియ, సృజన్‌ లోకేశ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎల్లిదే ఇల్లితనకా’ నిన్న శుక్రవారం (11/10/2019) విడుదలైంది. అయితే ఈ సినిమాలో సృజన్, హరిప్రియల మధ్య ఒక ముద్దు సన్నివేశం ఉంది.

అయితే ఇది పూర్తిగా ‘గీత గోవిందం’ సినిమాలోని 'విజయ్‌ దేవరకొండ–రష్మికా మండన్నా' ల మధ్య వచ్చే చుంబన డృశ్యం లాగే ఉందని, ఆ ఆ ముద్దు సన్నివేశంలో రష్మికలాగే  హరిప్రియ కూడా జీవించి తన్మయంలో నటంచారని సోషల్‌ మీడియా - జనాలు పోలికలు పెట్టారు. 

సోషల్‌ మీడియా పోలికలపై హరిప్రియ స్పందిస్తూ "నా సినిమాలను నా అభిమానులు, ప్రేక్షకులు వారి కుటుంబంతో సహా చూడాలనుకుంటాను. ఇప్పటి వరకూ రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నేను నటించలేదు. కాకపోతే ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలో కథకు అవసరం కాబట్టి ముద్దు సన్నివేశంలో పాల్గొన్నా. అయితే అది రష్మికా మండన్నాలా లిప్‌-లాక్‌ సన్నివేశం కాదు. నాది మామూలు ముద్దే" అన్నారు.

ఒక్కో మగువతో ముద్దు ఒక్కోలా ఉంటుందంటారు. ముద్దు ముద్దుకు అభేదం చెప్పారు హరిప్రియ. అంతేలే ఒక్కోకరితో ముద్దు ఒక్కోలా ఉంటుందని - నాతో ముద్దు ప్రత్యేకం అంటూ ముగించింది హరిప్రియ. అయితే రష్మిక తో అధర భందనం గురించి దాని మాధుర్యం ఒక్క విజయ్ దేవరకొండకే తెలుసు. ఇక హరిప్రియతో అధర చుభనం గురించి సృజన్ లోకేష్ మాత్రమే చెప్పగలరు. వీళ్ళ మద్య డిబేట్ పెడితే బెటర్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: