శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
ముఖ్యంగా తనని కంత్రి ఆటలు ఆడుతున్నారని వరుణ్ సందేశ్ విమర్శించడాన్ని తట్టుకోలేకపోయిన శివ జ్యోతి కన్నీటి పర్యంతం అయ్యింది. ఇంతలో వరుణ్.. శివజ్యోతి దగ్గరకి వచ్చి.. 'నువ్ నన్ను అనలేదా..? నేను బతకకపోతే అందరికీ ముంచేయాలనే యాటిట్యూడ్ నీది.. ఇది ఎంత బ్యాడ్' అంటూ గొడవని మరింత పెద్దది చేశాడు. ఇంతలో వితికా వచ్చి వరుణ్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది.
ఇక ఈ నామినేషన్స్ పై హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య మరోసారి చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్ తనపై కౌంటర్ వేయడంతో తట్టుకోలేని శ్రీముఖి తనతో మాట్లాడొద్దని తెగేసి చెప్పింది. 'నీతో మాట్లాడడానికి నాకసలు ఇంట్రెస్ట్ లేదని' రాహుల్ వెటకరంగా వెయ్యడం జరిగింది. మొత్తంమీద మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.