నితిన్ కూడా తప్పుకున్నాడు ?
త్వరలోనే ఈ విడుదలతేదీ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తుండగా ఛలో ఫేమ్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న డిస్కోరాజా కూడా ఫిబ్రవరికి వాయిదాపడిందని వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ నుండి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ప్రస్తుతానికైతే సాయి తేజ్ నటిస్తున్న ప్రతిరోజు పండగే ఒక్కటే క్రిస్మస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకానుంది. ఈచిత్రం తో పాటు బాలకృష్ణ నటిస్తున్న రూలర్ కూడా అదే సమయంలో విడుదలకానుందని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు మేకర్స్ ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.